బావి రక్షణ గోడ నిర్మాణానికి శంకుస్థాపన

బావి రక్షణ గోడ నిర్మాణానికి శంకుస్థాపన

SRPT: హుజూర్‌నగర్ పట్టణ ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించడమే తమ లక్ష్యమని మున్సిపల్ ఛైర్మన్ దొంతగాని శ్రీనివాస్ తెలిపారు. శనివారం పట్టణంలోని 3వ వార్డులో రూ. 5 లక్షల వ్యయంతో నిర్మించనున్న బావి రక్షణ గోడ (ప్రొటెక్షన్ వాల్) పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. మంత్రి ఉత్తమ్‌ సహకారంతో పట్టణంలోని అన్ని వార్డులను ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని ఆయన పేర్కొన్నారు.