యాకుత్‌పుర మ్యాన్ హోల్ ఘటన.. అధికారుల తొలగింపు..!

HYD: పాతబస్తీ యాకుత్‌పురలో మ్యాన్ హోల్‌లో చిన్నారి పడిన ఘటనను హైడ్రా సీరియస్‌గా పరిగణించింది. దీనిపై క్షుణ్ణంగా విచారణ జరిపిన హైడ్రా, ఈ ఘటన DRF సూపర్‌వైజర్లు ఇద్దరు, మెట్ టీమ్ సిబ్బంది ఇద్దరి నిర్లక్ష్యం వల్ల జరిగిందని తేల్చింది. సూపర్‌వైజర్లకు డిమోషన్, మెట్ సిబ్బందిని తొలగించాలని ఆదేశించింది.