విరిగిపడిన 100 ఏళ్ల నాటి వేపచెట్టు!
BPT: భారీ తుఫాన్ ధాటికి కొరిశపాడు మండలం మేదరమెట్ల బస్టాండ్ వద్ద గల 100 ఏళ్ల నాటి వేపచెట్టు నేలకొరిగింది. మంగళవారం రాత్రి వీచిన రాకాసి గాలులకు ఎన్నో ఏళ్ల నుంచి ప్రయాణీకులకు, ఆటో స్టాండ్ వారికి నీడనిస్తున్న చెట్టు విరిగి నేలను తాకిందని ప్రజలు అంటున్నారు. చెట్టు విరగడం వల్ల సమీపంలో ఉన్న విద్యుత్ తీగలు తెగిపడ్డాయి.