జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ :తహసీల్దార్

NLR: అల్లూరు మండల ప్రజలకు తహసీల్దార్ లక్ష్మీనారాయణ ముఖ్య సూచనలు తెలియజేశారు. ఇవాళ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. అల్లూరు మండలంలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం ఈ నెల 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఉంటుందని పేర్కొన్నారు. సచివాలయ సిబ్బంది ద్వారా లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.