వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో

వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో

BDK: మణుగూరు ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో పల్నాటి వెంకటేశ్వరరావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లో వంటగదిని పరిశీలించారు. విద్యార్థులకు వడ్డించే ఆహారాన్ని రుచి చూసీ, వారు నిద్రించే గదులను పరిశీలించారు. హాస్టల్లో వసతులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో వార్డెన్‌కు సూచనలు చేశారు.