పోలీస్ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన SP
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర పోలీస్ స్టేషన్‌ను SP జానకి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ స్టేషన్ పరిసరాలను, రికార్డులను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమావేశమై స్థానిక నేర నియంత్రణ పరిస్థితులు, మహిళల భద్రత, రాత్రి పహారా విధులు, సహా సైబర్ నేరాలపై అవగాహన తదితర అంశాలపై సమీక్షించారు.