ఆహార కల్తీపై అప్రమత్తంగా ఉండాలి: దామోదర
TG: ఆహార కల్తీ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి దామోదర రాజనర్సింహ హెచ్చరించారు. HYDలో ఫుడ్ సేఫ్టీ అవేర్‌నెస్ వాకథాన్ ప్రారంభించిన తర్వాత మాట్లాడుతూ.. ఆహార కల్తీపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కల్తీ కట్టడికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్ల సంఖ్యను పెంచుతామని తెలిపారు. కాగా ఈ వాకథాన్ నెక్లెస్ రోడ్డు నుంచి HMDA గ్రౌండ్స్ వరకు సాగనుంది.