అమర్ నాథ్ యాత్రకు వెళ్లే వారికి వైద్య పరీక్షలు

అమర్ నాథ్ యాత్రకు వెళ్లే వారికి వైద్య పరీక్షలు

గుంటూరు: ఈ ఏడాది అమర్ నాథ్ యాత్రకు వెళ్లే జిల్లా యాత్రికులకు గుంటూరు సర్వజనాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక వైద్య బృందాన్ని నియమించినట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ S.S.V రమణ తెలిపారు. రేపటి నుంచి ప్రతి సోమ, గురువారాల్లో పరీక్షలు ఉంటాయన్నారు. యాత్రకు 13 ఏళ్ల నుంచి 75 వారు అర్హులన్నారు. వివరాల కోసం 9100200866 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.