ఆర్టీసీ బస్సు ఢీ.. దుప్పికి తీవ్ర గాయాలు

ఆర్టీసీ బస్సు ఢీ.. దుప్పికి తీవ్ర గాయాలు

KMM: సత్తుపల్లి వేంసూరు రోడ్డులోని షాదిఖాన్ సమీపంలో ఆదివారం ఆర్టీసీ బస్సు దుప్పిని ఢీకొట్టింది. రోడ్డు దాటే ప్రయత్నంలో ప్రమాదం జరిగి దుప్పి తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వగా, వారు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన దుప్పిని వెటర్నరీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం దానిని సత్తుపల్లి నీలాద్రి అర్బన్ పార్క్‌కు తరలించారు.