రేపు బ్రహ్మోత్సవాలు ప్రారంభం

రేపు బ్రహ్మోత్సవాలు ప్రారంభం

CTR: దక్షిణ కాశీగా విరాజల్లుతున్న పుంగనూరు నెక్కొంది కొండపైనున్న శ్రీ ప్రసన్న పార్వతీ సమేత అగస్తీశ్వర స్వామి శివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అర్చకులు ఇవాళ తెలిపారు. ఆలయాన్ని శుద్ధి చేసి ముస్తాబు చేశారు. 10న మంగళవారం అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమై 19వ తేదీ వరకు జరుగుతాయని అన్నారు.