VIDEO: తోటలోకి దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రమాదం

VIDEO: తోటలోకి దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రమాదం

అన్నమయ్య: రాయచోటి-వేంపల్లి జాతీయ రహదారిపై మద్దిరేవుల వంక వద్ద ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం తప్పింది. బోయకొండ నుంచి వేంపల్లికి వెళ్తున్న కారు అదుపుతప్పి సమీపంలోని మామిడి తోటలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, కారులో ఇరుక్కుపోయిన ఇద్దరు యువకులను క్షేమంగా బయటకు తీశారు. ఈ ఘటనలో యువకులకు స్వల్ప గాయాలయ్యాయి.