VIDEO: శ్రీకాళహస్తిలో CITU ఆధ్వర్యంలో నిరసన
TPT: శ్రీకాళహస్తిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం CITU నాయకులు లేబర్ కోడ్ చట్టాలను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ చట్టాలను వెంటనే ఉపసంహరించుకొని, కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాస్తూ, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా చట్టాలు చేయడం దారుణమన్నారు.