ఎమ్మెల్యే గురజాల రేపటి పర్యటన వివరాలు
CTR: ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చిత్తూరు పట్టణంలో శుక్రవారం పర్యటించనున్నారని ఆయన క్యాంపు కార్యాలయం తెలిపింది. 29వ వార్డులో ఉదయం 8 గంటలకు పర్యటన ప్రారంభమై సాయంత్రం 4:30 గంటలకు కొంగారెడ్డిపల్లెలో ముగుస్తుందని వెల్లడించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభిస్తారని పేర్కొన్నారు. కార్యకర్తలు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.