జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేసిన ఛైర్పర్సన్
ములుగు పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని మున్సిపల్ ఛైర్పర్సన్ చంద్రకళ గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రవిచందర్, కౌన్సిలర్లతో కలిసి సోమవారం తనిఖీ చేశారు. వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి, అందుతున్న వైద్య సేవలు, ఆహారంపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌తో సమావేశమై వసతులు, అవసరాలపై చర్చించారు.