VIDEO: అగ్ని ప్రమాదంలో దగ్ధమైన ఇల్లు
ASR: కొయ్యూరు మండలం పాత బాలారంలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఓ తాటాకు ఇల్లు పూర్తిగా కాలిపోయింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి, గ్రామానికి చెందిన విజ్జెపు కొండబాబుకు చెందిన ఇల్లు పూర్తిగా కాలిపోయిందని స్థానికులు తెలిపారు. ఇంట్లో సామాగ్రి, దుస్తులు మొత్తం కాలి బూడిదయ్యాయని తెలిపారు. సుమారు రూ.4లక్షల మేర నష్టం వాటిల్లిందన్నారు.