విషాదం: నవ వరుడు ఆత్మహత్య
AP: నవ వరుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. నగరూరు గ్రామానికి చెందిన శరత్ కుమార్‌కు గత నెల 2న వివాహమైంది. అయితే, 4 రోజుల క్రితం వధువు పుట్టింటికి వెళ్లగా.. శరత్ బెంగళూరుకు వెళ్లాడు. శుక్రవారం నంద్యాలలోని స్నేహితుడి గదికి వెళ్లిన శరత్.. తన భార్యతో సుమారు గంటసేపు మాట్లాడాడు. అనంతరం పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.