మెట్టుగూడ రోడ్లపై ట్రాఫిక్ ఫ్రీ@ 11:35AM
HYD: మెట్టుగూడ నుంచి తార్నాక, హబ్సిగూడ మార్గాల్లో ప్రతిరోజు విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. కానీ.. ఆర్టీసీ బంద్ నేపథ్యంలో రోడ్లపై ట్రాఫిక్ అంతగా కనిపించడం లేదు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతం వాహనాలు సాఫీగా సాగుతున్నాయి. ప్రయాణికులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఎండలు విపరీతంగా ఉండడంతో, కొంతమంది ఇంటికే పరిమితమవుతున్నారు.