VIDEO: చెత్త చెదారంతో అధ్వానంగా పార్క్
WGL: నర్సంపేట పట్టణంలోని మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలోని పార్క్ చెత్తాచెదారం, మురుగు నీటితో అధ్వానంగా మారింది. దీంతో పార్కుకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యపై పలుమార్లు మీడియాలో కథనాలు రాసిన కూడా అధికారులు స్పందించడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు ఇవాళ డిమాండ్ చేశారు.