లెన్స్‌కార్ట్ ఐపీఓకు 28 రెట్ల స్పందన
ప్రముఖ కళ్లజోళ్ల విక్రయ సంస్థ లెన్స్‌కార్ట్ సొల్యూషన్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యు సబ్‌స్క్రిప్షన్ నేటితో ముగిసింది. చివరి రోజు 28.26 రెట్ల సబ్‌స్క్రిప్షన్ అందుకుంది. రూ.7,278 కోట్లు నిధుల కోసం 9.97 కోట్ల షేర్లను విక్రయానికి కంపెనీ ఉంచింది. ఐపీఓలో భాగంగా ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.382-402గా కంపెనీ నిర్ణయించింది. ఈ షేర్లు NOV-10న లిస్ట్ కానున్నాయి.