భారీ వర్షాలు.. ఇద్దరు మృతి

భారీ వర్షాలు.. ఇద్దరు మృతి

రాజస్థాన్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. కుండపోత వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కోట, బూంది, సవాయ్, మాధోపూర్, టోంక్‌లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో జనజీవనం స్తంభించిపోయి, అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.