VIDEO: పేదల ఇళ్లు కూల్చడానికి మీకు ఎంత ధైర్యం?: కవిత
HYD: పేదల ఇళ్లు కూల్చడానికి మీకు ఎంత ధైర్యం? అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. జాగృతి కార్యాలయంలో మాట్లాడుతూ.. కూలీ నాలీ చేసుకుని ఇళ్లు కట్టుకుంటే క్షణాల్లో నేలమట్టం చేశారని, వెలుగుమట్ల బాధితులకు ప్రభుత్వం కనీసం ఆహారం కూడా పెట్టడం లేదని ఆరోపించారు. ఖమ్మంలో ముగ్గురు మంత్రులు, కలెక్టర్ ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు.