VIDEO: అంబులెన్స్‌ను బోల్తా కొట్టించిన ప్రజలు

VIDEO: అంబులెన్స్‌ను బోల్తా కొట్టించిన ప్రజలు

బెంగళూరులోని రిచ్‌మండ్ సర్కిల్ సమీపంలో నిన్న రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ అంబులెన్స్ వేగంగా వచ్చి రెడ్ సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న పలు బైక్‌లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇస్మాయిల్ అనే వ్యక్తి, అతని భార్య అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. దీంతో స్థానికులు అంబులెన్స్‌ను ఎత్తి బోల్తా కొట్టించారు. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.