చండూర్‌లో అక్రమ కట్టడాలు కూల్చివేత

NLG: చండూర్ పట్టణంలో మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. మున్సిపాలిటీలో రోడ్డు విస్తరణలో భాగంగా మాజీ మున్సిపల్ ఛైర్మన్ తోకల చంద్రకళ వెంకన్నకు చెందిన అక్రమ కట్టడాలను జేసీబీ సాయంతో కూల్చి నేలమట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.