భారతీయులను విడిపించేందుకు చర్యలు: విదేశాంగశాఖ

భారతీయులను విడిపించేందుకు చర్యలు: విదేశాంగశాఖ

మాలీలో ఐదుగురు భారతీయులు కిడ్నాప్‌నకు గురి కావటంపై విదేశాంగశాఖ స్పందించింది. భారతీయులను విడిపించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. ఈ మేరకు మాలీ అధికారులతో కలిసి పని చేస్తున్నట్లు బమాకోలోని భారత దౌత్యకార్యాలయం తెలిపింది. ఈ కిడ్నాప్ ఘటన నవంబర్ 6వ తేదీన జరిగినట్లు చెప్పింది. ఈ మేరకు Xలో పోస్ట్ చేసింది.