మా తదుపరి టార్గెట్ అదే: శుభ్‌మన్ గిల్

మా తదుపరి టార్గెట్ అదే: శుభ్‌మన్ గిల్

టీమిండియా క్రికెటర్ శుభ్‌మన్ గిల్ తదుపరి లక్ష్యంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. 'వన్డే ప్రపంచకప్ గెలవడం మా తదుపరి లక్ష్యం. గత ఫైనల్లోనే మేం తృటిలో టైటిల్ కోల్పోయాం. సౌతాఫ్రికా వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ 2027 మాకు మరో అవకాశం. ఏ ఫార్మాట్‌లోనైనా దేశం కోసం ప్రపంచకప్‌ను గెలవడం మా ప్రధాన లక్ష్యం. ఈ ఆలోచన ఎప్పుడూ నా మనసులో తిరుగుతూనే ఉంటుంది' అని పేర్కొన్నాడు.