స్వంత వ్యయంతో సీసీ కెమెరాలు బిగింపు

స్వంత వ్యయంతో సీసీ కెమెరాలు బిగింపు

SDPT: బెజ్జంకి మండల కేంద్రంలో ప్రజా భద్రతకు తోడ్పడే చర్యగా ఒక టీ దుకాణం యజమాని దేవదాసు తన స్వంత వ్యయంతో ప్రధాన రహదారిపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన బెజ్జంకి ఎస్ఐ బోయిని సౌజన్య ఆయనను శాలువాతో సన్మానించి అభినందించారు. సమాజానికి ఉపయోగపడే పనిలో ముందుండిన దేవదాసు పై స్థానికులు ప్రశంసలు కురిపించారు.