BREAKING: మాజీ మంత్రికి గుండెపోటు
AP: మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయనను కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. గొల్లపల్లి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.