VIDEO: జిల్లాలో కిటకిటలాడిన ఆలయాలు
జగిత్యాల జిల్లా కేంద్రంలో గురువారం నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని పలు ఆలయాలు కిటకిటలాడాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాల్లో పెద్దఎత్తున ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగిత్యాల పట్టణంలోని అష్టలక్ష్మి దేవాలయం, సాయిబాబా దేవాలయం, అయ్యప్ప, సుబ్రహ్మణ్య స్వామి, ఎడ్ల అంగడి రామాలయాల్లో భక్తులు బారులు తీరారు.