ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే

ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే

బాపట్లలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. పెన్షన్, రేషన్‌కు సంబంధించిన పలు దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. వాటిని జాప్యం లేకుండా సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.