సాధారణ ప్రసవంలో బాలభీముడి జననం

KNR: చొప్పదండిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన సాధారణ ప్రసవంలో మాచర్ల మానసకు నాలుగు కిలోల బరువు ఉన్న మగశిశువు జన్మించినట్లు మండల వైద్యాధికారి శ్రీకీర్తన తెలిపారు. తల్లీకుమారులు ఇద్దరూ ఆరోగ్యకరంగా ఉన్నారని తెలిపారు. సాధారణ ప్రసవంలో నాలుగు కిలోల బరువుగల శిశువు ఎలాంటి ఇబ్బంది లేకుండా జన్మించడం, అది పీహెచ్‌సీలో చాలా అరుదు అని ఆమె చెప్పారు.