'ఆదివాసీల సమస్యలను పరిష్కరించాలి'

'ఆదివాసీల సమస్యలను పరిష్కరించాలి'

ASF: జిల్లాలోని గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న ఆదివాసీల సమస్యలను పరిష్కరించాలని సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ కోరారు. మంగళవారం సచివాలయంలో ఉమ్మడి జిల్లా ఇంఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా అభివృద్ధికి మంత్రి కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.