సఖి సెంటర్ తనిఖీ చేసిన కలెక్టర్
PDPL: రంగంపల్లిలోని సఖి సెంటర్‌ను కలెక్టర్ శ్రీహర్ష ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు. సందర్భంగా పలు రికార్డులు పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. సెంటర్‌కు వచ్చే బాధితులకు అవసరమైన సహాయం అందించాలని సూచించారు. హలో సఖి సెంటర్ గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని తెలిపారు. హింసకు గురవుతున్న మహిళలకు సఖి సెంటర్ ద్వారా సేవలు అందించాలని పేర్కొన్నారు.