రుషికొండపై వెంకన్నను చూసొద్దాం రండి

VSP: రుషికొండ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందుతోంది. తిరుమల తరహాలో రుషికొండలోనూ శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని 2019లో టీటీడీ ప్రారంభించింది. గీతం యూనివర్సిటీ పక్కన, సాగర తీరానికి ఎదురుగా 10 ఎకరాల్లో, 60 మీటర్ల ఎత్తులో రూ. 28 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇది చిన్న తిరుపతిలా అన్ని సౌకర్యాలతో సిద్ధమైంది.