VIDEO: టికెట్ దక్కలేదని కాంగ్రెస్ నేత ఆత్మహత్యాయత్నం!
SRPT: కాంగ్రెస్ టికెట్ల లొల్లి సెగలు రేపుతోంది. 25వ వార్డు టికెట్ ఆశించిన కోడి శివ యాదవ్, పార్టీ హ్యాండివ్వడంతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. గత ఎన్నికల్లో త్యాగం చేసినా ఇప్పుడు మొండిచేయి చూపడమేంటని ఆయన నిలదీశారు. దీంతో సూర్యాపేటలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. కార్యకర్తలు ఆయనను అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.