కేసీఆర్‌తో కేటీఆర్, హరీశ్ రావు కీలక భేటీ
SDPT: ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు బుధవారం కీలక భేటీ నిర్వహించారు. ఈనెల 27న జరగనున్న BRS ఆవిర్భావ దినోత్సవ సభ ఏర్పాట్లపై వీరు సుదీర్ఘంగా చర్చించారు. పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, జన సమీకరణ, నాయకుల సమన్వయంపై సమీక్షించారు. సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.