యువత అన్ని రంగాల్లో ముందుండాలి: కలెక్టర్

యువత అన్ని రంగాల్లో ముందుండాలి: కలెక్టర్

ADB: జిల్లా యువత చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించి ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక జడ్పీ సమావేశ మందిరంలో యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాలు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థి దశలోనే మంచి మార్గంలో నడవడం అలవాటు చేసుకోవాలని సూచించారు.