రాంచంద్రరావుకు బీజేపీ చీఫ్ ఫోన్
తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచంద్రరావుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఫోన్ చేశారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాంచంద్రరావుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణలో బీజేపీని బలోపేతం చేయాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా కృషి చేయాలని నేతలకు సూచించారు. ఇందుకోసం ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలని, కార్యకర్తలు, నేతలు సమిష్టిగా పని చేయాలన్నారు.