చికిత్స పొందుతూ వివాహిత మృతి

చికిత్స పొందుతూ వివాహిత మృతి

ATP: రాయదుర్గం అంబేడ్కర్ నగర్‌లో ఎలుకల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రూప అనే నవవదువు చికిత్స పొందుతూ మృతి చెందింది. అదే కాలనీలోని అనిల్‌తో రూపకు 3 నెలల క్రితం వివాహమైంది. శనివారం ఆ యువతి విశ ద్రావణం తాగగా, బళ్లారికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందిందని బంధువులు మంగళవారం తెలిపారు. భర్త, అత్త వేధింపులతోనే మృతి చెందినట్లు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.