VIDEO: ప్రాణాలకు ముప్పుగా మారిన బావి
GDWL: ఇటిక్యాల నుంచి పొగాకు కంపెనీకి వెళ్లే మార్గంలో రోడ్డు అంచున ఉన్న బావి ప్రస్తుతం ప్రమాదకరంగా మారింది. గతంలో ఇదే ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. బావి చుట్టూ ఏర్పాటు చేసిన కంచె శిథిలమవడంతో వాహనదారులు భయంతో ప్రయాణిస్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి బావి చుట్టూ పటిష్టమైన రక్షణ గోడ నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.