నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరైన ఉపాధ్యాయులు
GNTR: ఏపీ టీచర్స్ ఫెడరేషన్ పిలుపులో భాగంగా తమ సమస్యల పరిష్కారం కోరుతూ గురువారం ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. సంగం జాగర్లమూడిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొని, నేటి నుంచి ఈనెల 17వ తేదీ వరకు నిరసన వారంగా రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందని చెప్పారు.