సుధాకర్ రెడ్డి మృతిపై ఎమ్మెల్యే దిగ్భ్రాంతి

ATP: కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. ప్రజల కోసం జీవితాంతం పోరాడిన ఆయన సీపీఐ జాతీయ కార్యదర్శిగా విశిష్ట సేవలు అందించారని తెలిపారు. విలువలకు కట్టుబడి పనిచేసిన సుధాకర్ రెడ్డికి ఘన నివాళి అర్పిస్తున్నానని పేర్కొన్నారు.