కోడిపందాల స్థావరంపై దాడి.. 15 మంది అరెస్ట్
ELR: పెదపాడు మండలం కొనికి గ్రామంలో కోడిపందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పెదవేగి సీఐ రాజశేఖర్ తన సిబ్బందితో మంగళవారం అర్ధరాత్రి కోడిపందాల స్థావరంపై దాడి చేశారు. అక్కడ కోడిపందాలు నిర్వహిస్తున్న 15 మంది కోడి పందెం రాయుళ్లను అరెస్ట్ చేశారు. వారి నుంచి 8 కోడిపుంజులను, 20 కోడి కత్తులను, మూడు కార్లను 65,200 నగదును స్వాధీనం చేసుకున్నారు.