యోగ మాస్టార్ల వేతనాలు పెంచాలని వినతి

NDL: ఆరోగ్య మందిర్ యోగ ఇన్ స్ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు ఆదివారం నంద్యాల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. యోగ మాస్టర్లకు జాతీయ ఆరోగ్య మిషన్, ఆయుష్ శాఖ ఇచ్చే వేతనాన్ని పెంచాలని వారు కోరారు. ప్రతి మండలంలో ఒక యోగ మందిరాన్ని ఏర్పాటు చేసి ఇద్దరు యోగ మాస్టర్లకు ఉపాధి కల్పించాలని వారు తెలిపారు.