నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
KMR: భిక్కనూర్ పట్టణ పరిధిలో విద్యుత్ లైన్ల నిర్వహణ, సబ్‌స్టేషన్ మరమ్మత్తు పనుల కారణంగా నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ సంకీర్త్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ తెలిపారు. వినియోగదారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన కోరారు.