ప్రతిభచాటిన జిల్లా విద్యార్థులు
ELR: అమరావతిలో జరిగిన విద్యార్థుల అసెంబ్లీలో ఏలూరు జిల్లా విద్యార్థులు ప్రతిభచాటారు. ఉంగుటూరు నుంచి పీఎన్ కొలను జెడ్పీ హైస్కూల్ విద్యార్థి గురుప్రసాద్ యువజన క్రీడా మంత్రిగా వ్యవహరించాడు. జిల్లా నుంచి నిఖిల్ సాయి, గోపి నాగచైతన్య, పూర్ణ గణేష్, మణికంఠలు స్టూడెంట్ ఎమ్మెల్యేలుగా పాల్గొన్నారు. గైడ్ టీచర్లుగా సుబ్బరాజు, రమణి బాధ్యతలు నిర్వహించారు.