ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేసిన డీఈవో

ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేసిన డీఈవో

AKP: కశింకోట మండలం కొత్తపల్లి ఎంపీపీ స్కూల్ ఉపాధ్యాయురాలు ఆర్ దేవి కుమారి సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి జి. అప్పారావు నాయుడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విధి నిర్వహణలో సమయపాలన పాటించడం లేదని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పలు పర్యాయాలు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. దీంతో సస్పెండ్ చేసినట్లు వివరించారు.