రాష్ట్ర కాపు కార్పోరేషన్ డైరెక్టర్‌గా స్వామి నాయుడు
కోనసీమ: రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్‌గా మామిడికుదురు మండలం మొగలికుదురు గ్రామానికి చెందిన సుధా వెంకటస్వామి నాయుడు నియమితులయ్యారు. దీనికి సంబంధించి 15 మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. ఈ కమిటీలో పి.గన్నవరం నియోజకవర్గం నుంచి నాయుడుకి అవకాశం లభించింది. ఈ సందర్భంగా ఆయనను పలువురు అభినందించారు.