విశాఖకు భారీ LPG నౌక.. గ్యాస్ కష్టాలకు ఊరట

విశాఖకు భారీ LPG నౌక.. గ్యాస్ కష్టాలకు ఊరట

VSP: తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్కు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో 47 వేల టన్నుల ఎల్పీజీతో 'Pine Gas' ట్యాంకర్ విశాఖ పోర్టుకు చేరుకుంది. ధమ్రా(ఒడిశా) కు వెళ్లాల్సిన ఈ నౌకను, సరఫరా అవసరాలను దృష్టిలో పెట్టుకుని విశాఖకు మళ్లించినట్లు అధికారులు తెలిపారు. పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చిన ఈ నౌక ద్వారా తక్షణ సరఫరా చేపట్టనున్నారు.