'మాగంటి సునీతను అధిక మెజార్టీతో గెలిపించాలి'
BHPL: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ.. యూసుఫ్‌గూడలో ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన రెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. ప్రజలు BRS అభ్యర్థి సునీతను గెలిపించాలని కోరారు.