అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ
NDL: జిల్లాలో పలు అభివృద్ధి పనులను ఎంపీ బైరెడ్డి శబరి ఇవాళ ఘనంగా ప్రారంభించారు. పాణ్యం మండలం మద్దూరు గ్రామంలో నూతనంగా ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంటు రోడ్లను నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధి తమ లక్ష్యమని బైరెడ్డి శబరి అన్నారు. కూటమి ప్రభుత్వంలోనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఆమె తెలిపారు.